Hospet Famous Tukaram Military Hotel | Traditional Kodi Kura | Mutton Curry | Hospet | Food Book
Вставка
- Опубліковано 6 лют 2025
- 70ఏళ్ల క్రితం ప్రారంభించిన తుకారం మిలటరీ హోటల్ శుభ్రతతో కూడిన రుచికరమైన అనేక మాంసాహార వంటకాలు అందిస్తున్న తరుణంలో తిన్ననోటి సదాభిప్రాయంతో హోస పేటలో ప్రసిద్ధి చెందింది.
7 దశాబ్దాలుగా నిర్వహించబడుతున్న ఈ ఆహారశాలతో తమకు ఉన్న అనుభందాన్ని పలువురు మనస్ఫూర్తిగా మనతో పంచుకున్నారు.
తమ అత్తమ్మ గారి వద్ద వంట నేర్చుకున్న రాజేశ్వరి గారు.ఆ విధానంలోనే తొలినాళ్ళ నుండి నేటి వరకు కొనసాగిస్తున్నారు.
వంటకానికి సంప్రదాయ రూపుదాలేలా తయారీ చేపట్టారు.వినియోగం అప్పుడు ముడి పదార్థాల నాణ్యత మనకు విడమరిచి వివరించారు.తాజా మాంసంకు అల్లంవెల్లుల్లి,ధనియాలు వంటి సాధారణ సుగంధ ద్రవ్యాలు, కారం స్వల్ప మోతాదులో ఏకం చేసి కట్టెల పొయ్యి మీద వంటకం సిద్ధం చేశారు.శుభ్రత గురించి మరోమారు చెబుతున్నాను విధిగా పాటించారు.
వంటకాలు సహజత్వం ఓనగూర్చుకుని ఉన్నాయి.మీరే చూడొచ్చు ఆ మేని రూపం.సుగంధ ద్రవ్యాలు తీవ్రత ఏ వంటకంలో అగపడలేదు,కారం మమకారంగానే ఉంది.రుచి విషయానికొస్తే తుస్తే ఓ వంటకంతో మరో వంటకం సరి తూగుతుంది.
ఇచ్చట నా ఆహార ఆస్వాధనను ఇప్పుడు వీక్షించగలరు.గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.