Eruka cheppedane - bhajana- ఎరుక చెప్పెదనే - భజన ( శ్రీకృష్ణానంద గురు స్వామి )

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • శ్రీ కృష్ణానంద స్వామి గారిది గొప్ప ఆధ్యాత్మిక జీవనయానం . మహబూబ్ నగర్ జిల్లా మరికల్ లో , ఓ గొర్రెల కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించారు . ఏ చదువులు చదవని స్థాయి నుండి, భక్తి సాధనా మార్గంలో సాధన చేస్తూ, నిజామాబాద్ కు చెందిన ఆధ్యాత్మిక గురువు రామానంద పరమహంస వారి దగ్గర శిష్యరికం చేశారు . తరువాత క్రమంలో ఆధ్యాత్మిక గురువై , అత్యంత నిగూఢ విషయాలతో కూడిన తత్వాలు , కీర్తనలు భజనలు రాసి ప్రపంచానికి అందజేశారు . వీరు యోగి . దాదాపు 50 ఏళ్ళుగా, ఏ ఆహారం తీసుకోకుండానే తృప్తిగా ఉంటున్న నిరాహార యోగి వీరు . భక్తులు గురు స్వామిగా పిలుచుకుంటారు . గ్రామాల్లో నిత్యం తిరుగుతూ,సాధకులకు ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ, ప్రజల్లో గొప్ప మార్పును తీసుకువస్తున్నారు . ఇప్పడివరకు వారు 500 కు పైగా తత్వాలు , 1000 కి పైగా కీర్తనలు రాశారు .
    వారి చిరునామ
    శ్రీ కృష్ణానంద గురుస్వామి
    దత్తవైకుంఠపురం
    గ్రామం : బండార్ పల్లి
    మండలం : చిన్న చింతకుంట
    జిల్లా : మహబూబ్ నగర్

КОМЕНТАРІ • 28