🙏నేనెవరిని?🙏

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • 🥳 𝐖𝐇𝐎 𝐀𝐌 𝐈 ?🥳
    ఒక వ్యక్తి వ్యక్తిత్వం తెలియాలంటే అతని మాటలు బట్టి లేదా అతను చేసిన పనులు బట్టి అంచనా వేయవచ్చు. 34 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా నేను చేసిన
    సర్వీసెస్ నేనెవరినో మీకు చెప్పకనే చెబుతాయి.
    షేక్ సాయి బాబ్జీ, 𝐌.𝐀.,𝐁.E𝐝.,.అను నేను 64 సంవత్సరాలు వయస్సు గల ఒక రిటైర్డ్ హెడ్ మాష్టర్ ని .
    నా పాఠశాల చరిత్రే, నా చరిత్ర అవుతుంది.
    నేను 𝐌𝐨𝐝𝐞𝐥 𝐩𝐫𝐢𝐦𝐚𝐫𝐲 𝐬𝐜𝐡𝐨𝐨𝐥 నరసాపురం ,కోరుకొండ మండలం, తూ.గో.జిల్లా లో ,2011 june లో ఈ పాఠశాల కి HEAD MASTER గా వచ్చి- 2020 జూన్ లో ఇక్కడే retire అయ్యాను.
    🥳విద్యలకు నిలయం ఈ ఆలయo🥳
    నేను ఇక్కడకి వచ్చేనాటికే చక్కని ఉపాధ్యాయులు వున్నారు.వారి సహకారంతో నేను కలలు గన్న MODEL స్కూలు ని ఆవిష్కరించడానికి ప్రయత్నం మొదలుపెట్టాను.
    పిల్లలు స్కూలు కి సరదాగా ఆడుతూ పాడుతూ వచ్చి ,ఇంటి కంటే స్కూలు బాగుంది అని అనుకునేలా -ఒక చక్కని స్కూలు వాతావరణాన్ని పిల్లల కి అందించాలి, వాళ్లని ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా, అన్ని రంగాలలోను తీర్చి దిద్దాలి అని మా ఉపాధ్యాయులo కంకణం కట్టుకున్నాం .
    నేను 2011 లో ఈ పాఠశాలకి వచ్చే నాటికి ఒకవైపు గోడ లేకపోవటంతో open గా వుండేవి . దానితో రోజూ రాత్రుళ్లు, గేదేలు స్కూలు అరుగుల పై పడుకుని పాడుచెసెసేవి .స్థానిక పెద్దలు MPTC అయిన శ్రీ రాయపాటి సత్తిబాబు గారు, శ్రీ కట్టా సత్తిబాబు గారు మున్నగు వారి సహాకారంతో MLA గారిని కలిసి వారి 𝐅𝐔𝐍𝐃𝐒 తో గోడని కట్టాం .
    అప్పటి మా SMC ఛైర్మన్ అయిన శ్రీ రాయుడు శ్రీను గారి ద్వారా తాపి పని వారి సంఘం 𝐟𝐮𝐧𝐝𝐬 తో స్కూలు ENTRANCE గేటు పై 𝐀𝐑𝐂𝐇 నిర్మించాం.
    పాఠశాల పై 𝐓𝐇𝐄𝐌𝐄 𝐒𝐎𝐍𝐆𝐒 నేనే వ్రాసి ,నా స్వంత ఖర్చులతో 𝐒𝐓𝐔𝐃𝐈𝐎 లో పాడి, నా తోటి masters చే పాడిస్తూ, 𝐑𝐄𝐂𝐎𝐑𝐃ING చేయించాను.వాటిని వినిపిస్తూ ,చక్కని చదువులుచెబుతాం అని హామీ ఇస్తూ వీధి వీధి తిరిగాం .ఆ విధంగా అడ్మిషన్స్ పెంచుకున్నాం.
    𝐒𝐒𝐀 వారి సహకారంతో కొత్త బిల్డింగ్ నిర్మించుకున్నాం .
    దాతల సహకారంతో మూడు కంప్యూటర్లు తో 𝐜𝐨𝐦𝐩𝐮𝐭𝐞𝐫 𝐥𝐚𝐛 ఏర్పాటు చేసుకుని , శ్రీ కడియాల పాపారావు గారు స్కూలు కి ఉచితంగా NET CONNECTION ఇవ్వడంతో ప్రాధమిక స్థాయి నుంచే COMPUTER EDUCATION ఇచ్చాము. అమెరికా లో స్థిరపడ్డ, ఈ పాఠశాల విద్యార్థి శ్రీ మారిసెట్టి విష్ణు (S/O వెంకటేశ్వరావు) గారు, స్కూలు అభివృద్ధికి Rs.25000/- విరాళం ఇచ్చారు. యువజన సంఘాలు, మొత్తం గ్రామం అంతా స్కూలు కి వెన్ను దన్నుగా నిలబడింది.
    మరొక దాత శ్రీ బొల్లిoపల్లి సీతా రాంబాబు గారి సహాకారం తో 𝐩𝐫𝐨𝐣𝐞𝐜𝐭𝐨𝐫 and screen ఏర్పాటుచేశారు. 𝐒𝐒𝐀 వారు 𝐁𝐈𝐆 సైజ్ 𝐓𝐕 ఇచ్చారు.ఆ విధంగా 2017 నాటికే SCHOOL DIGITALISATION అయ్యింది.
    ఒక దాత శ్రీ పెదపాటి భీమ రాజు గారు గోడ పై చక్కని school పేరు 𝐩𝐚𝐢𝐧𝐭𝐢𝐧𝐠 వేయించారు.
    నావంతు కర్తవ్యంగా మా నాన్న గారి పేరున పిల్లలు అందరికీ టై, బెల్ట్ ,𝐈𝐃 కార్డ్ ,మా అమ్మగారి పేరున అందరికీ మీల్స్ ప్లేట్స్ బహూకరణ చేశాను .
    ఒక మహిళా మూర్తీ శ్రీమతి ప్రగడ ఆది లక్ష్మి గారు స్కూలు ఆవరణలో సరస్వతి గుడి కట్టించారు.
    నేను వెళ్లే నాటికి పిల్లలు నేలపై కూర్చొనే వారు.ONGC వారి సహకారంతో అన్ని తరగతులు కి BENCHES ఏర్పాటుచేసుకున్నాం. ఇలా అందరూ పేరెంట్స్ మీటింగ్ కి హాజరయ్యేవారు.
    ప్రతీ ఏడు పిల్లల్ని విహార యాత్ర కి జిల్లాలోని ప్రముఖ ప్రదేశాలకు తీసుకుని వెళ్ళేవాళ్ళం.
    ఒక స్వచ్ఛంద సంస్థ ASDS సహకారంతో పిల్లలందరికి 𝐒𝐇𝐎𝐄𝐒 సమకూరాయి.
    𝐇𝐏𝐂𝐋 వారి సహకారంతో 𝐇𝐀𝐍𝐃 𝐖𝐀𝐒𝐇 ఏర్పాటయ్యింది.
    పిల్లలతో సంక్రాంతి సంబరాలు, భోగిమంటలు , ముగ్గుల పోటీలు, విచిత్ర వేషాలు వేయించేవాళ్ళం .
    గ్రామస్తుల విరాళాలతో భారీ ఎత్తున వార్షికోత్సవం నిర్వహించేవాళ్ళం .మా ఉపాధ్యాయులు కూడా విరాళాలు వేసుకునే వాళ్ళం .ఇసుక వేస్తే రాలనంత జనసందోహం వచ్చేది .ఆ రాత్రికి నరసాపురం గ్రామం అంతా ఇక్కడే వుండేది .పాటలకు సంగీతం , డ్యాన్స్ 𝐜𝐨𝐦𝐩𝐨𝐬𝐢𝐧𝐠 & 𝐒𝐈𝐍𝐆𝐈𝐍𝐆
    నేను, నా ఉపాధ్యాయులు చేసే వాళ్ళం. వార్షికోత్సవంలో నేను సేకరించిన మరియు వ్రాసిన దేశ భక్తి గేయాల పుస్తకాన్ని 𝐌𝐋𝐀 గారి చేతి మీదుగా ఆవిష్కరణ జరిగింది. పూజ్యులు శ్రీ షేక్ సూరా సాహెబ్ , శ్రీమతి షేక్ నాగూరు బీబీ
    (నా తల్లితండ్రులు) కి ఈ పుస్తకం అంకితం ఇచ్చాను .గ్రామ యువజన సంఘం చాలా సహకరించింది .
    ఆ విధంగా పిల్లల మనస్సులోను ,గ్రామస్థుల మనస్సులోను చెరగని తీపి గుర్తులు ఇచ్చాము.ప్రభుత్వం కూడా నా సేవలు గుర్తించి "జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డ్ 2009" లోను, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు
    అవార్డ్ 2019 లోను అందుకుని పరిపూర్ణమైన ఆత్మ సంతృప్తి తో ,2020 జూన్ లో RETIRE అయ్యాను. నా 34 సంవత్సరాల service లో, ఎక్కడ పనిచేసినా ఇదేవిధంగా DEDICATION తో WORK చేశాను. ఇదంతా ఆ భగవంతుడు నా చేత చేయించిన కర్తవ్యం గా భావిస్తున్నాను.
    ఇది మా పాటశాల విజయగాథ, అదే నా విజయగాథ అని సగర్వవంగా చెప్పగలను .
    ప్రస్తుతం "BLISSFUL RETIREMENT "అనే UA-cam CHANNEL ద్వారా మీకు చేరువ అయ్యాను. ఇదే నా గురుంచి క్లుప్తంగా మిత్రులారా . మీ అందరికీ నా హృదయ పూర్వక నమస్సుమాంజలులు తెలియజేస్తున్నాను 🙏🙏🙏
    TO BE CONTINUED....
    🙏𝐓𝐇𝐀𝐍𝐊𝐒 𝐅𝐎𝐑 𝐖𝐀𝐓𝐂𝐇𝐈𝐍𝐆
    𝐨𝐧 𝐛𝐞𝐡𝐚𝐥𝐟 𝐨𝐟
    " 𝐁𝐋𝐈𝐒𝐒𝐅𝐔𝐋 𝐑𝐄𝐓𝐈𝐑𝐄𝐌𝐄𝐍𝐓"
    యూట్యూబ్ ఛానెల్.🙏
    yours lovingly
    🫡SHEIK SAI BAABJEE 🫡
    Follow me on Facebook: / sai.babjee
    Follow me on Instagram: / sheik_sai_babjee
    Follow me on Twitter: x.com/babjee_s...

КОМЕНТАРІ • 36