చెల్లుబోయినవేణునిఅత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం - గొందేసి శ్రీనివాస రెడ్డి యువసేన అధ్యక్షులు కైఫ్

Поділитися
Вставка
  • Опубліковано 2 тра 2024
  • మళ్ళీ సీఎంగా జగన్ ని చేసుకుందాం
    - చెల్లుబోయిన వేణు ని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం
    - గొందేసి శ్రీనివాస రెడ్డి యువసేన అధ్యక్షులు కైఫ్ పిలుపు
    రాజమహేంద్రవరం, మే 3: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేసుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని ప్రముఖ న్యాయవాది, వైస్సార్సీపీ సీనియర్ నాయకులు గొందేసి శ్రీనివాస రెడ్డి యువసేన అధ్యక్షులు కైఫ్ అన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో ప్రజలు కష్టాలు, ఇబ్బందులు తెలుసుకుని, వారి సమస్యలను అవగాహన చేసుకుని నవరత్నాలు పథకాలను ప్రకటించారని గుర్తుచేశారు. ఎన్నికల్లో గెలిచాక ఇచ్చిన హామీలను 90శాతం పైగా అమలు చేసి, అర్హులైన పేదలందరికీ నేరుగా ఇంటికే ఆయా పథకాలను చేర్చారని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎంగా జగన్ చరిత్ర సృష్టించి, నమ్మకానికి నిదర్శనంగా నిలిచారని ఆయన పేర్కొంటూ ఇప్పుడు నవరత్నాలు ప్లస్ ప్రకటించారని గుర్తుచేసారు. పేద ప్రజలకు న్యాయం చేసిన జగన్ ని మరోసారి సీఎంగా గెలిపించుకోవాలని, ఇందుకోసం రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కైఫ్ కోరారు. ఈవిధంగా ఎమ్మెల్యేలను గెలిపిస్తే జగన్ సీఎం గా మళ్ళీ బాధ్యతలు చేపట్టి నవరత్నాలు ప్లస్ పథకాలను అమలుచేస్తారని ఆయన చెప్పారు. గత రెండు ఎన్నికల్లో రూరల్ నియోజక వర్గం నుంచి టిడిపి గెలిచినప్పటికీ ఈ పదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీలేదని కైఫ్ అన్నారు. వేణుని గెలిపిస్తే, రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో కృషి చేస్తున్న గొందేసి శ్రీనివాసుల రెడ్డి పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నారని, మంత్రి వేణుకి విజయం చేకూర్చడానికి శ్రమిస్తున్నారని కైఫ్ అన్నారు. శ్రీనివాసుల రెడ్డిని పార్టీలో ఒక సముచిత స్థానంలో చూడాలని కోరుకుంటున్నామన్నారు. అయితే వెన్నుపోటు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయని కైఫ్ పేర్కొంటూ, శ్రీనివాసుల రెడ్డికి చెడ్డపేరు తెచ్చేవిధంగా ఎవరైనా వ్యవహరిస్తే, వారిని వదిలిపెట్టబోమని అన్నారు. గొందేసి శ్రీనివాస రెడ్డి యువసేన సభ్యులు లోకేష్, సూరంపూడి గోపి, బత్తిన సతీష్ కుమార్, పాలిక రవి, సాయి, శాండీ, కమల్, కిషోర్, కక్కల శివ, జొన్నాడ శశికుమార్ తదితరులు పాల్గొన్నారు

КОМЕНТАРІ •