Kaaru Moyilu Daarilo Lyrics | SP Balu Christian Song | Old Telugu Christian song

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 77

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 2 роки тому +24

    ఆధ్యాత్మికంగా చాలా గొప్ప పాట. బాలు గారు అద్భుతంగా పాడారు. గత మూడు నాలుగు దశాబ్దాలుగా వినినా మళ్ళీ వినాలని పించే ఏకైక పాటు . పాట ఎప్పుడూ వినినా చిన్న నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి .... ఇంతకన్నా మంచి క్రిస్తవ భక్తి గీతం నేను మళ్ళీ వినలేదు. బహుశా అది చిన్నప్పుడు రేడియో లో అనేక సార్లు వినటమో లేక అమృత స్వర గాయకులు పాడటం వలనో తెలియదు గానీ ఇదొక అద్భుత గీతం.... హృదయాన్ని కదిలించేపాట.బాలుగారు ప్రాణంపోశారు.... గౌరవ బాల సుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట హృదయాన్ని హత్తుకుంది. అలాగే ఈ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేసినవారు చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు.50ఏళ్ల క్రితం విన్న ఈ పాట ఎప్పటికీ జీవం పోసుకుని ఉంది, ఎప్పటికీ ఉంటుంది.యుగయుగాలు ఉంటుంది. ...9949938146.

    • @eliminatejoshuamanoharmess472
      @eliminatejoshuamanoharmess472 2 роки тому +2

      సంగీతము M.M కీరవాణి గారు అద్భుతమైన సంగీత బాణీలను కూడ జతచేసి శ్ర్యావంగ హృద్యంగా ఎంతో అద్భుతమైన రీతిలో సమకూర్చారు.

    • @vkmusicmedia2235
      @vkmusicmedia2235 Рік тому +2

      Yes you are right brother 👍

    • @narenderreddyakkati4019
      @narenderreddyakkati4019 Рік тому +2

      Baga cheppavu

    • @anandarao6658
      @anandarao6658 Рік тому +2

      Wonderful song with relevant lyrics, sung with Heart and soul by late Balu garu. Praise the Lord.

    • @mohanbabu488
      @mohanbabu488 Рік тому +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @GurramEdward
    @GurramEdward 6 місяців тому +4

    ఇలాంటి గొప్ప పాటలు డౌన్లోడింగ్ కి అవకాశం పెట్టండి. బ్రదర్

    • @prabhakar64
      @prabhakar64 6 місяців тому

      Brother,, Here you can download mp3 song here
      calvarylyrics.blogspot.com/2021/01/kaaru-moyilu-daarilo.html

  • @sudheerprakash
    @sudheerprakash Рік тому +15

    కారు మోయిలు దారిలో కఠిన శిలల నేలలో...
    వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ జాలునా...// కారు//
    1. ఇరుకు లోయ నడుమలో... కరకు రాతి అడుగులో...
    మరణ భయము నార్పివేయు కరుణ జలము లురునా...// కారు//
    2. ఎండినా ఎడారిలో... మండుటెండా మేరలో...
    మధుర వాయు తటుల వీచి మనసు సేద దీరునా...// కారు//
    3. రుధిర సిక్త నగములో... హృదయ భగ్న పదములో...
    మధుర మృదుల పదములైన మాటలెన్నో వచ్చునా...// కారు//
    4. స్వామి యేసు సిలువలో... జీవ జలపు నదులలో...
    హృదయ క్షుదను దీర్చు క్రీస్తు... విమల సుధల నిండగా...// కారు మోయిలు దారిలో//
    - Urs . SP. Hyd

    • @prabhunedunuri2205
      @prabhunedunuri2205 Рік тому +3

      తటుల కాదు ఇది , టటుల అని పాడాలి. టటుల అంటే నిందలు అని అర్ధం

    • @GurramEdward
      @GurramEdward 6 місяців тому +2

      థాంక్యూ బ్రదర్

    • @yacobchitikela1740
      @yacobchitikela1740 3 місяці тому +1

      తటులు కాదు తతులు అనాలి తతులు అనగా సమూహము అని అర్థము​@@prabhunedunuri2205

    • @csrao4007
      @csrao4007 Місяць тому +1

      Thank you sir.​@@prabhunedunuri2205

  • @samueljoshijillella9728
    @samueljoshijillella9728 3 роки тому +11

    నా చిన్నప్ఫటి మాధుర్య్యం ఉన్న పాట
    పాట వింటున్నప్ఫుడు అ రోజులు గుర్తుకు తెచ్చింది

  • @vykuntamkasa5947
    @vykuntamkasa5947 2 роки тому +9

    ఎన్ని నోళ్ళ పొగడనురా ఆ గాన మాధుర్యాన్ని, ఆ భావ గాంభీర్యాన్ని.
    తెలుగు వాడి నైనందుకు బాలూ గారి సమకాలికు డై నందుకు గర్వంతో పొంగి పోతున్నాను .... అద్భుత రచన, అమూల్య స్వరకల్పన.
    (ఏదైనా ఒక పాట పోస్ట్ చేసినప్పుడు రాసిన వారి పేరు,సంగీతం సమకూర్చిన వారి పేరు, పాడిన వారి పేరు విధిగా తెలియజేస్తే బాగుంటుందని నా అభిప్రాయం )

    • @shekelos
      @shekelos Рік тому

      రచయిత:
      లేట్ రెవ. పులిదిండి సాల్మన్ రాజు; నెగ్గిపూడి, పశ్చిమ గోదావరి
      21-02-1921:::28-12-2019
      ** గురువులు: లూథరన్ సంఘం
      ** డైరెక్టర్... సువార్తవాణి...1964
      ** లెక్చరర్ బర్మింగ్హామ్ లో దశాబ్దానికి పైగా
      విజిటింగ్ ప్రొఫెసర్: నాలుగు దేశాలు
      ** కళాకారులు: బాటిక్ చిత్రకళ, ఆయిల్ పెయింటింగ్స్
      గానం:
      పద్మవిభూషణ్ లేట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం;
      చెన్నై

  • @snvsrinivasarao1191
    @snvsrinivasarao1191 2 місяці тому +1

    ఈ పాటలో కొన్ని పాత పదాలకు అర్థం తెలియటం లేదు దయచేసి ఎవరైనా తెలిసిన వారు ఈ పాట యొక్క పూర్తి అర్ధాన్ని వాడుక భాషలో చెప్పగలరు🙏🙏🙏

  • @SonySony-cj1bj
    @SonySony-cj1bj 2 роки тому +8

    నా చిన్నప్పుడు Radio లో విని నేర్చుకొని పాడేవాడిని మా నాన్నగారు Radio లోవిని నీవేనా ఈ పాటపడినది అని అడిగేవారు నాకు చాలా ఇష్టమైన పాట ఈ పాటలో ఎంతో అర్థం ఇమిడివు న్నది ఈ పాట వ్రాసిన కవి గారికి అభినందనలు పాడిన బాలు గారికి కూడా

  • @goodmorning7307
    @goodmorning7307 3 роки тому +8

    SP Balu గారు ఎంత ఆర్ద్రతతో పాడారు...పాటలో ఎంత అర్థముంది ... పదాలు అమృత వాక్కులు. 🙏🙏🙏

  • @eliminatejoshuamanoharmess472
    @eliminatejoshuamanoharmess472 2 роки тому +7

    ఎన్ని సార్లు విన్నా ఆశతీరదు ఈ లోకంలో ఎంతోమంది వ్యక్తులు ఎన్నో సార్లు వారి ఇష్టప్రకారమే వారికి ఇష్టం వచ్చినట్లు జీవితము లో వేసారిపోయిన వేలలో ఈ పాట వింటే మనకొరకు మన కన్న తండ్రి యేసుక్రీస్తు ప్రభువు మన పాపుల నిమిత్తం పాపము లను విడిపించే టందుకు పడిన కష్టం కరుణించి దేవుడు క్షమించుటకు కష్టపడిన శ్రుష్టికర్త రక్షణ కర్త క్షమాపణ కర్త అని బైబిల్ గ్రంథము మన అందరి కొరకు
    మన అందరి నిమిత్తం విలువైన శ్రమల ద్వారా రక్షణ పాప రక్షణ క్షమాపణ అనుగ్రహించాడు పరిశుద్ధ దేవుని కుమారుడుగా
    జన్మించిన దేవుడు.

  • @kvssastry8407
    @kvssastry8407 9 місяців тому +1

    Madhura maina balyam radio tappa marmite teliyani madhura gnaapakaalu.ever green and all time great song

  • @whilsonwhilson5158
    @whilsonwhilson5158 8 місяців тому +1

    Bro balu 40years ago intha mahamakaranga padinaaru, Devuniki mahima kalugunu gaka

  • @PJBCMRajeev
    @PJBCMRajeev Рік тому +2

    Amazing song..Hallelujah.childhood memory..thanks balu garu

  • @nirmalpriya5570
    @nirmalpriya5570 Рік тому +2

    Old days gurthu ku vachai🙏

  • @ratnakumar7863
    @ratnakumar7863 Місяць тому +2

    CALVARY LYRICS VAARIKI VANDANAALU
    EE SONG NU POORTI GA TELUGU LOKI TRANSLATE CHEYAGALARANI PRARTHANA
    THANK YOU

  • @justforchrist3213
    @justforchrist3213 Рік тому +2

    Praise the lord god bless you Balu garu👌🙌

  • @yeruvashekarreddy3544
    @yeruvashekarreddy3544 Рік тому +2

    Praise God Amen this song is very heart touching Sprituval nd impressive song i had heard this song many more times still i hearing i pray God Almighty will save of Balasubramaniam's family ✝️🙏

  • @movement1to10
    @movement1to10 9 місяців тому +1

    My sweet memory in childhood days,thankyou very much for this.

  • @kantepudijohnprabhakar9400
    @kantepudijohnprabhakar9400 Рік тому +2

    Super duper

  • @gkrao123k
    @gkrao123k 4 місяці тому +1

    Thanks for re presenting a very rare suoer hit song

  • @RameshPaulofficial
    @RameshPaulofficial 3 роки тому +5

    Remembering Olden days This Song Thank you Lord

  • @dayavaramanichitturi1969
    @dayavaramanichitturi1969 2 роки тому +2

    Abba antha Chakkalackal padaru SPB garu 🙏

  • @bhudevipowroji9063
    @bhudevipowroji9063 Рік тому +2

    Praise the lord ❤🙏

  • @dayavaramanichitturi1969
    @dayavaramanichitturi1969 2 роки тому +2

    Antha Baga padaru S.P.Balu garu 🙏🙏🙏

  • @praveendasari1627
    @praveendasari1627 2 роки тому +8

    It was written by Late Rev Dr P Solomon Raj garu, the former Director of Suvartha Vani, Vijayawada. Music was composed by Late Srihari Sarma garu, a violinist at Suvartha Vani.

  • @prizebabu
    @prizebabu Рік тому +2

    Lyrics collection &posting very accurate thanks reddy garu I am searching for coorect lyricssince 4years Thankyou for posting

  • @pratapbaby9125
    @pratapbaby9125 2 роки тому +2

    Amazing song from SP . Amazing Lyrics ,beautiful traditional music

  • @arla.george4110
    @arla.george4110 2 роки тому +3

    Very nice song. Praise the Lord

  • @marlapudiravi9291
    @marlapudiravi9291 3 роки тому +3

    Old is gold.. Praise the lord....

  • @elisharaoyedla4664
    @elisharaoyedla4664 Рік тому +2

    Thanks a lot..

  • @dr.m.c.newtonbobtelugugosp4767
    @dr.m.c.newtonbobtelugugosp4767 2 роки тому +2

    Remembering great writer SOLOMON RAJU garu,
    S.P. BALU garu,
    Music Director ,Srihari Sarma garu . (They are all Late),
    Though it a living & Loving song.

    • @nareshakumarthi
      @nareshakumarthi Рік тому

      Though, the three legends behind this song are late, this song is eternal. Wonderful. Thanks for the information, Sir.

  • @kumarbandanadham1958
    @kumarbandanadham1958 3 роки тому +3

    One of the greatest songs.

  • @rapuriart
    @rapuriart 2 роки тому +3

    I love this song

  • @jayanthikolli5543
    @jayanthikolli5543 3 роки тому +2

    Very good meaningful song. RIP sir

  • @lillysogoodtoseeyoubothinj5550
    @lillysogoodtoseeyoubothinj5550 3 роки тому +3

    Praise the Lord.

  • @gdevamanoharam4286
    @gdevamanoharam4286 Рік тому +2

    Eepatanakupranam

  • @vedamarg
    @vedamarg 2 роки тому +2

    What a beautiful and melodious composition !

    • @elishamalabanti1546
      @elishamalabanti1546 Рік тому +1

      Sir Can you please tell the meaning of many hard words in this song. Many listeners dont know the meaning of many words in this song. Thanks a lot in advance

    • @vedamarg
      @vedamarg Рік тому +3

      @@elishamalabanti1546
      నిజానికి చిన్న చిన్న పదాలు ..వాక్యాలతో మంచి లోతైన అర్ధం తో కూడిన సాహిత్యాన్ని ఇచ్చారు రచయిత . అంతే భావోద్వేగంతో సంగీతం సమకూర్చారు సంగీత దర్శకులు. ఇహ బాల సుబ్రహ్మణ్యం గాత్రం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
      వీడియో లో మూడో చరణంలో ఒక పదం తప్పుగా రాయడం జరిగింది.
      మధుర మృదుల కధములైన అని రాసారు. అది కధములైన కాదు ప్రదములైన. అంటే అర్ధం ఇవ్వగలుగు/ఒనర్చు/కూర్చు అని .
      పాటలో సాహిత్యానికి నాకు తెలిసున్నత వరకూ కొంచం వివరంగా రాయడానికి ప్రయత్నించాను.
      వివరణ కోసం సాహిత్యంలో లేని విధంగా కూడా అర్ధం ఉదాహరణగా చెప్పడం జరిగింది.
      భాష బాగా వస్తే కొన్ని పాటల్లోని సాహిత్యాన్ని అలాగే ఆస్వాదించ వచ్చు.
      కొన్ని పాటలని ఆ పాట రాసిన కవి యొక్క హృదయంతో అర్ధం చెప్పాల్సి ఉంటుంది.
      పల్లవి :
      కారు మొయులు దారిలో
      కఠిన శిలల నేలలో
      వెలుగు విరులు వెలసి
      కనుల విందు చేయ జాలునా
      వెళ్ళే దారిలో ఆకాశం మొత్తం నల్లని కారు మేఘాలు కమ్మేసి ఉన్నాయి..అంటే దట్టమైన మబ్బులకి అంతా చిమ్మ చీకటి అయిపొయింది.
      కాళ్ళ కింద నడవడానికి వీల్లేకుండా పదునైన రాళ్ళు గుచ్చుకుంటు పాదాలని గాయ పరుస్తున్నాయి..
      అలాంటి భయానకమైన కష్ట సమయంలో సమయంలో ఒక్క సారిగా దారి పొడుగునా వెలుగులు చిమ్మే పూలు లేదా పూల మొక్కల బారులతో కూడిన దారులు ప్రత్యక్షమై ..
      నా కనులకి ఏమైనా విందు చేయగలవా .. లేక ఆనందాన్ని ఇవ్వగలవా .. అని ఆశ పడుతున్నాడు ..
      చరణం 1
      ఇరుకు లోయ నడుమలో
      కరకు రాతి అడుగులో
      మరణ భయము నార్పి వేయి
      కరుణ జలము లూరునా
      బాగా ఇరుకు గా ఉన్న లోయ మధ్యలో అంటే కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే వరసగా నడవడానికి సరిపడా వెడల్పు ఉన్న కొండల మధ్యన చిన్న లోయ లాంటి రహదారిలో , కఠిన మైన పదునైన కొండరాళ్ళ పై నడిచి నడిచి పాదాలు కూడా రాళ్ళు లాగానే మారిపోయి స్పర్శ కూడా తెలియకుండా అడుగులు వేస్తూ వెళ్తున్నప్పుడు వేసే మరణ భయాన్ని ఆర్పేసే లేదా పోగొట్టే క్రీస్తు యొక్క కరుణ అనే జలము వర్షంలా కురియదా ... లేదా ఆ నడిచే దారిలోని రాళ్ళ కింద నుంచి గాయ పడుతున్న పాదాలకి ఉపశమనం కలిగించేలా భూమి లో నుంచే అయన యొక్క కరుణ జలము ఉబికి రాదా ... అని ఆశ పడుతున్నాడు.
      చరణం 2
      ఎండినా ఎడారి లో ..
      మండుటెండ మేరలో .
      మధుర వాయు తటులు వీచి
      మనసు సేద తీరునా ..
      ఎక్కడా తేమ/తడి/చల్లదనం అనే మాటే లేని ఎడారిలో . ఎటు చూసినా మండిపోతూ నిప్పులు చెరిగే ఎండలో
      పరిమళ భరితమైన /కమ్మని /చల్లని గాలి తరంగాలు వీచి నా మనసు కాస్త ఏమైనా సేద తీరుతుందా అని ఆశ పడుతున్నాడు..
      చరణం 3
      రుధిర సిక్త నగములో
      హృదయ భగ్న పదములో
      మధుర మృదుల ప్రదములైన
      మాటలెన్న వచ్చునా
      రుధిరము అంటే రక్తం, నగము అనే కొండ. రక్తంతో తడిసి ముద్దైన కొండ లోనూ
      హృదయ భగ్నపదములో అంటే ..ఇక్కడ పదము అంటే కీర్తన/గానం/గీతము/గేయము అని నానా అర్ధాలు ఉంటాయి .. ఒకచో గాధ అని కూడా అర్ధం వస్తుంది. హృదయం భగ్నమై పొతే వచ్చే గానంలో లేదా గాధ లో
      మధురమైన మరియు మృదుత్వాన్ని ఇవ్వగలిగిన మాటలు
      చెప్పడం అనేది మనసుకి సాధ్యమయ్యేనా .. అని విలపిస్తున్నాడు.
      చరణం 4
      స్వామీ యేసు సిలువలో
      జీవ జలపు నదులలో
      హృదయ క్షుదను దీర్చు క్రీస్తు
      విమల సుధలు నిండగా
      యేసు సిలువలోనూ, ఈ భూమ్మీద ఉన్న అన్ని జీవ నదులలోనూ మనుషుల హృదయలోని బాధ లేదా శోకాన్ని తీర్చ గలిగే క్రీస్తు యొక్క నిర్మలమైన అమృతముతో నిండి పోవాలి లేదా నిండి పోవు గాకా .

    • @elishamalabanti1546
      @elishamalabanti1546 Рік тому +1

      Sir Thanks a lot for taking your precious time and explaining the meaning of the whole song. It is so nice of you. We are blessed by your knowledge of Poetic Telugu. All Viewers can enjoy the song more as they know the correct meaning now. I never thought you will reply so fast . I am very grateful to you. May God bless you for your time and efforts you have put in explaining the song. Glad to get to know such kind persons. May God bless you
      Is there any way You can post your reply on UA-cam for the benefit of all. I got the reply in the mail. I don't see it here
      Thanks Once again. God bless you

    • @snvsrinivasarao1191
      @snvsrinivasarao1191 2 місяці тому +1

      Thankyou so very much sir❤​@@vedamarg

  • @snehahelpinghands8958
    @snehahelpinghands8958 3 роки тому +2

    V v v good song.

  • @jyothikumari6644
    @jyothikumari6644 3 роки тому +3

    Amen 🙏🙏🙏

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib 7 місяців тому +2

    కారు మోయిలు అంటే అర్ధం ఏంటి?

  • @Ramasaheb
    @Ramasaheb 3 місяці тому +2

    Movie name please brother 🎉

  • @Calvarylyricstelugu
    @Calvarylyricstelugu  3 роки тому +1

    🙏🙏🙏 Praise the GOD to everyone,
    The same song lyrics available @ calvarylyrics.blogspot.com/2021/01/kaaru-moyilu-daarilo.html

  • @upscsunny9798
    @upscsunny9798 9 місяців тому +1

    Lyricist - en.wikipedia.org/wiki/P._Solomon_Raj

  • @sudheerprakash
    @sudheerprakash Рік тому +2

    sir, pls provide track for this song..

  • @pothurajuperikala7143
    @pothurajuperikala7143 3 роки тому +4

    Who is the writer of this Lyrics..? anybody know..?

  • @dayavaramanichitturi1969
    @dayavaramanichitturi1969 2 роки тому +2

    Karu mabbulu krammukunna aedari ani anukuntunnanu naku kuda meaning theliysdhu pl.

  • @sesharao668
    @sesharao668 4 місяці тому +2

    కారు మొయిలు దారిలో..
    కఠిన శిలల నేలలో..
    వెలుగు విరులు వెరసి కనుల విందు సేయ జాలునా..
    ఇరుకులోయ నడుమలో
    కరకు రాతి అడుగులో
    మరణ భయము నార్పివేయు కరుణ జలములూరునా......
    ll కారు మొయిలు ll
    ఎండిన ఎడారిలో
    మండుటెండ మేరలో
    మధుర వాయు తటులు వీచి మనసు సేదదీరునా...
    ll కారు మొయిలు ll
    రుధిర సిక్త నగములో
    హృదయ భగ్న పదములో
    మధుర మృదుమ కధములైన మాటలెన్న వచ్చునా...
    ll కారు మొయిలు ll
    స్వామి యేసు శిలువలో
    జీవజలపు నదులలో
    హృదయ క్షుదను దీర్చు క్రీస్తు
    విమల సుధలు నిండగా...
    ll కారు మొయిలు ll

  • @pratapbaby9125
    @pratapbaby9125 2 роки тому +3

    This song writer Rev DR AB. Masila Mani

    • @SonySony-cj1bj
      @SonySony-cj1bj 2 роки тому

      A B మాసిలామని గారు కాదు Soloman Raju గారు వ్రాసింది

    • @praveendasari1627
      @praveendasari1627 2 роки тому +1

      Sorry. It was written by Rev Dr P. Solomon Raju, former Director of Suvartha Vani, Vijayawada.

  • @sunithaallu3925
    @sunithaallu3925 2 роки тому +4

    Song chala sarlu vinnanu...kani first sentence meaning Naku theliyadu..
    yevaryna cheppagalara...pls...

    • @vedamarg
      @vedamarg Рік тому +3

      మొయిలు అంటే మేఘం. మొయిలు కి బహువచనం వచ్చి మొయిళ్ళు అంటే మేఘాలు. కారు అంటే అర్ధం నల్లని. కారు మొయిలు దారిలో అంటే నల్లని మేఘం కమ్ముకున్న దారిలో.. అని అర్ధం మిత్రమా !

    • @sunithaallu3925
      @sunithaallu3925 Рік тому +1

      ​@@vedamargThank you so much,...my brother in Christ

    • @elishamalabanti1546
      @elishamalabanti1546 Рік тому +2

      @@vedamarg Thanks a lot Sir. Can you plz explain the meaning of other hard to understand words in this song. Appreciate your kind help