పిఠాపురం ప్రజల ఆకాంక్షలను 100 శాతం శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీరుస్తారు || JanaSena Party || Pithapuram

Поділитися
Вставка
  • Опубліковано 21 чер 2024
  • పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు
    • నియోజకవర్గ ప్రజలు అద్భుతం చేశారు.. విలువైన వ్యక్తిని ఎన్నుకున్నారు
    • నియోజకవర్గంలో ప్రతీ సమస్య పరిష్కారం దిశగా చర్యలు
    • తాగు నీటి సమస్య పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత
    • తీర ప్రాంత కాలుష్యం నివారిస్తాం
    • మూడు, నాలుగు రోజుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం పర్యటన
    పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటారని, ప్రతీ సమస్య పరిష్కారం దశగా ఆయన చర్యలు ఉంటాయని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారు స్పష్టం చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై నమ్మకంతో ఇంత భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజల ఆకాంక్షలను 100 శాతం నెరవేరుస్తారన్నారు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారు. బహుళ ప్రయోజనాలు లక్ష్యంగా ఆయన అడుగులు ఉంటాయన్నారు. మూడు, నాలుగు రోజుల్లో పిఠాపురం నియోజకవర్గంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉంటుందని తెలిపారు. తనను గెలిపించిన ప్రజల్ని కలవాలన్న ఆత్రుత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నప్పటికీ తన మీద పెట్టిన బాధ్యతకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఒక ఉప ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారని చెప్పారు.
    గురువారం సాయంత్రం చేబ్రోలులోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసంలో నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో శ్రీ నాగబాబు గారు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ
    "పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అద్భుతం చేశారు. పదేళ్లుగా ఏమీ ఆశించకుండా ప్రజా సమస్యలపై పోరాడుతున్న విలువైన వ్యక్తిని ఎంచుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ లాంటి దుర్మార్గ ప్రభుత్వం మళ్లీ వస్తుందని ముందే పసిగట్టిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వానికి వెన్నెముకలా నిలిచారు. ప్రజల్ని పీడించుకుతింటున్న వైసీపీని ఓడించేందుకు బీజెపీ, టిడిపీలను ఒక తాటి మీదకు తీసుకువచ్చారు. చెప్పినట్టుగా జనసేన 100 శాతం స్ట్రయిక్ రేట్ తో విజయం సాధించింది. కార్యకర్తల్లో ఉన్న కసే పార్టీని అత్యున్నత స్థానానికి తీసుకువెళ్లింది. పిఠాపురం నియోజకవర్గానికి వెంటనే రావాలన్న ఆత్రుత ఆయనకు ఉన్నా ఉప ముఖ్యమంత్రితో పాటు ఐదు శాఖల బాధ్యత ఆయనపై ఉంది. రాష్ట్రానికి చాలా చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన శాఖల మీద పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకునే పనిలో ఉన్నారు. తద్వారా ప్రజలకు ఎన్ని రకాలుగా న్యాయం చేయొచ్చనే ఆలోచన చేస్తున్నారు. పదవులు అనుభవించడానికి కాదు ప్రజలకు సేవ చేయడానికి వచ్చామని పదే పదే చెప్పే శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఎంత కష్టపడ్డారో ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి పదింతలు కష్టపడుతున్నారు. పిఠాపురం ప్రజల కోసం ఏదో ఒకటి చేసిన తర్వాత గెలుపు సంబరాలు చేసుకోవాలన్న ఆలోచన ఆయనకు ఉంది. పిఠాపురం ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మీ ఇంటి వ్యక్తిగా స్వీకరించండి.
    • తీర ప్రాంత కాలుష్య నివారణకు చర్యలు
    పిఠాపురం నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. తీర ప్రాంత కాలుష్యాన్ని నియంత్రించే దిశగా చర్యలు ఉంటాయి. కాలుష్య నియంత్రణ మండలి ఇప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతిలోనే ఉంది. పారిశ్రామిక వ్యర్ధాలు కొంత మంది నేరుగా సముద్రంలో కలిపేసి మత్స్యకారుల పొట్టకొట్టే అవకాశం ఎవరికీ ఇవ్వం. ఇలాంటి పరిశ్రమల్ని నియంత్రించే శక్తి మనకి ఉంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన సర్వీస్ చేస్తారు. తాగు నీటితోపాటు సుద్దగడ్డ రిజర్వాయర్ పూర్తి చేసి గొల్లప్రోలు ముంపు సమస్య పరిష్కారం చేయాల్సి ఉంది. చేనేతలు చెప్పిన జీఎస్టీ మినహాయింపు సమస్య ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టారు. దివ్యాంగుల ఫించన్ల సమస్య పరిష్కరించారు. ఇక ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తం అన్ని గ్రామాలు బాగు చేయాల్సిన బాధ్యత కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై ఉంది.
    • వైసీపీ స్కాములన్నీ కక్కిస్తాం
    వైసీపీలా పనికిమాలిన రూల్స్ పెట్టి వ్యవస్థల్ని ఇబ్బందిపెట్టం. ప్రజలకు పూర్తి స్థాయి సహకారం అందిస్తాం. వైసీపీ వాళ్లు శ్మశానాలు కూడా వదిలిపెట్టలేదు. చట్టాన్ని అతిక్రమించిన ప్రతి ఒక్కరు శిక్షార్హులే. అలా అని కక్ష సాధింపు చర్యల ఉండవు. నేరం చేసిన వారు మాత్రం శిక్షను తప్పించుకోలేరు. వైసీపీ వారు చేసిన కోట్లాది రూపాయిల స్కాములన్నీ కక్కిస్తాం.
    • పిఠాపురం శ్రీ పవన్ కళ్యాణ్ గారి అడ్డా
    పిఠాపురం నియోజక వర్గం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అడ్డా. ఇక్కడ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించిన వ్యక్తులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండి ఆయన తరఫున వారి సమస్యలు పరిష్కరిస్తారు. అలా అని ప్రజలకు ఉపయోగపడే పనులు ఎవరు చేసినా అడ్డుకోవద్దు. మనకి తెలుగు దేశం పార్టీతో ఎలాంటి విబేధాలు లేవు. నియోజకవర్గం పరిధిలో అక్రమ మైనింగ్ ని అడ్డుకోండి. గంజాయి, బ్లేడు బ్యాచ్ లు కనబడితే స్టేషన్లో అప్పచెప్పండి. ప్రజల కోసం ఇక్కడ శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేస్తారు. అప్పటి వరకు శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ ఆ వ్యవహారాలు చూస్తారు.
    వైసీపీ నుంచి ఎన్నికల ముందు కొంత మంది నాయకుల్ని తీసుకున్నాం. మంచి వ్యక్తులు అనుకున్న వారిని తీసుకోవాల్సి వచ్చింది. ప్రజలకు ఉపయోగపడతారు అనుకున్న వారు వచ్చి చేరతామంటే ఆలోచిస్తాం. గత ఎన్నికల్లో చాలా మంది వైసీపీ కార్యకర్తలు పరోక్షంగా జనసేనకు సహకరించారు. ప్రజల్ని ఏడిపించే వారు, నష్టం చేసేవారు చేరతామంటే మాత్రం రెడ్ మార్క్ వేసి ఆపేస్తాం. ఎవరు పార్టీలో చేరినా స్థానిక ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత మాత్రం జనసేన, టీడీపీ శ్రేణులకే ఉంటుంది" అన్నారు.
    #JanaSenaParty #PawanKalyan

КОМЕНТАРІ • 38

  • @PaashupathaAsthra
    @PaashupathaAsthra 5 днів тому +21

    ఆత్మ విమర్సే అతి పెద్ద ప్రతిపక్షం .. 😊😊😊

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs 5 днів тому +16

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు

  • @janakijanu6402
    @janakijanu6402 4 дні тому +2

    జై జై జనసేన కనకదుర్గమ్మ ఆశీర్వాదం పార్టీ సభ్యులు అందరూ ప్రజలందరూ చల్లగా ఉండాలి కనకదుర్గమ్మ అన్నకి ధైర్యం ఇవ్వాలి పవన్ అన్న అంటేనే పవర్ పవర్

  • @KiranKumar-rv1xs
    @KiranKumar-rv1xs 5 днів тому +15

    Jai Janasenani….
    Jai Janasainiks
    Jai Veera Mahilalu
    Jai JANASENA ✊✊✊

  • @byreddypolireddy5878
    @byreddypolireddy5878 5 днів тому +12

    Naaga baabu Gaaru I like u your character jai hind

  • @muralimohan977
    @muralimohan977 5 днів тому +4

    Jaiho Pawan ❤❤❤❤
    Nagababu garu, you are doing a good job❤

  • @malachinnamallaiahmala7381
    @malachinnamallaiahmala7381 4 дні тому +1

    Jai janasena

  • @KorampLLiNagaraju
    @KorampLLiNagaraju 5 днів тому +5

    Congratulations sir

  • @MahendraMahi-jy3np
    @MahendraMahi-jy3np 5 днів тому +1

    Ji జనసేన

  • @ullingalasrinivasarao4353
    @ullingalasrinivasarao4353 5 днів тому +1

    జై జనసేన ✊✊✊

  • @user-ie8ud3xu4c
    @user-ie8ud3xu4c 5 днів тому +8

    Pithapuram incharge ga nagababu garini unchandi baguntundhi

  • @shankarrao6794
    @shankarrao6794 5 днів тому +8

    ❤❤❤

  • @naveenkumargoud8092
    @naveenkumargoud8092 5 днів тому

    Jai janasena ✊🥳🙏

  • @rkg3902
    @rkg3902 5 днів тому +2

    Pithapuram should be developed like varanasi hope modi gives funds…. Please reduce pollution in vizag

  • @saibabasatya
    @saibabasatya 5 днів тому +1

    ఆ గుండు గాడు మరో సుంకర అన్నయ్య!!!!

  • @rambabuvandana3295
    @rambabuvandana3295 5 днів тому +1

    Jai Janasena

  • @ASHOKKUMAR-yj8dv
    @ASHOKKUMAR-yj8dv 5 днів тому +5

    Naga babu Garu Prajale mana balam so Enka paina meru varani 3 sarulu party meet petandi... Oka roju younger boys oka roju seniors oka roju womens antu weekly 3 days pilichi meru charchinchadi prajalatho raboye rojulo valaki emi avarasalu ani vatini meru nera veristhe automatic ga me party ki balam perugudhu balqm meqns praja adharana

  • @thepoliticalawareness1021
    @thepoliticalawareness1021 4 дні тому

    *Sir, In the first Cabinet meeting of present Government of India, Cabinet approved Rs 7453 Cr offshore Wind Energy Project in Tamilnadu and Gujarat. Andhra Pradesh should try to attract Investment on Green Energy like Solar, Wind and Hydrogen. Andhra Pradesh could give good competition to Tamilnadu in South India. New attractive policies should be there to do competition with Tamilnadu in Green Energy sector. Due to instability in Karnataka, many companies would move out. Even in Telangana they are hugely dependent on Freebies, they will also probably fall into mismanagement. Kerala is almost bankrupt. Please take some serious initiative in AP to do competition with Tamilnadu and Odisha.*

  • @ASHOKKUMAR-yj8dv
    @ASHOKKUMAR-yj8dv 5 днів тому +1

    Final ga previous video lo nenu chepanu save cheimani epudu meru nice with saving tho But another correction shirt and pant vesukoni shirt nu fold chesi ala nilabadithe me height ki oka charisma untundi sir juba vadhu

  • @sujatha123ful
    @sujatha123ful 5 днів тому

    Anna uppercaste gurinchi alochichandi

  • @ASHOKKUMAR-yj8dv
    @ASHOKKUMAR-yj8dv 5 днів тому +1

    sir Nagababu sir pls Media tho matlade tatapudu koncham gambryamga and sitting position striaght ah unte prajalaku akarshincha galuku tharu pls chandra babu 75ys anubavamula oka nadu kuda kurchilo vali mike patukoni matladi natuga nenu chuda ledhu recent ga CM nu enchukune samayam lo kuda 30 nimusalu paiga padt prest future ni grahinchi matladadu so pls

  • @SudheerPoluru-km2lm
    @SudheerPoluru-km2lm 4 дні тому

    Remove music and keep your words sir 😊

  • @ASHOKKUMAR-yj8dv
    @ASHOKKUMAR-yj8dv 5 днів тому +1

    For example Oka school mrng assembly lo oka principla ela nilabadi matladithe akada una motha students and most senior teacher kuda slient ga kamanistaru ala undali sir

  • @sivaff971
    @sivaff971 4 дні тому

    Miru music kaakunda vallu emi matladutunaro chupichandi brothers

  • @ganapathiamp8536
    @ganapathiamp8536 5 днів тому

    What about remaining constituencies?

  • @ASHOKKUMAR-yj8dv
    @ASHOKKUMAR-yj8dv 5 днів тому

    Me presence modu andharu attention ga undali anate meru attraction ga ravali pls

  • @ASHOKKUMAR-yj8dv
    @ASHOKKUMAR-yj8dv 5 днів тому +1

    juba dress change cheyandi meru pawan sir kuda

  • @ASHOKKUMAR-yj8dv
    @ASHOKKUMAR-yj8dv 5 днів тому +1

    Pls Nagababu garu Prajalanu kalisi sabanu arange chesi matlade tapdu Ok speak table with mike petti vachi prajalanu kurchili vesi water bottle echi meru me speech ni oka manchi politics ga evqndi

  • @narasimharama5083
    @narasimharama5083 4 дні тому

    రైస్, 400? 25 కేజీ. 1600 అయంది. అక్రమా రవాణా ని ఆపండి సార్

  • @user-sj4ko9zo9n
    @user-sj4ko9zo9n 5 днів тому +9

    Jai janasena

  • @mounipanda6310
    @mounipanda6310 5 днів тому +2

    Jai janasena

  • @NALONENUNNTV
    @NALONENUNNTV 5 днів тому

    Jai janasena

  • @fashiontailors134
    @fashiontailors134 5 днів тому

    Jai janasena