76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
Вставка
- Опубліковано 7 лют 2025
- 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి మరియు ఎనిమిదవ అదనపు జిల్లా జడ్జి ఎం సునీల్ కుమార్ జిల్లా కోర్టు ప్రాంగణము నందు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి మరియు ఎనిమిదవ అదనపు జిల్లా జడ్జి ఎం సునీల్ కుమార్ మాట్లాడుతు మన పూర్వీకులు మనకు ఇచ్చిన అనుభవాలను ఉపయోగించుకుంటూ రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచేలా ఉద్యోగస్తులు పనిచేయాలని, అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో న్యాయవాదులు విశేష కృషి చేయాలని, తద్వారా సమాజం అభివృద్ధి వైపు నడుస్తుందని సూచించారు. ప్రతి వ్యక్తి సొంత లాభాన్ని కొంత త్యాగం చేసి సమాజాభివృద్ధికి పాటుపడాలని కోరారు.
కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా జడ్జి పి.మంగాకుమారి, ఐదవ అదనపు జిల్లా జడ్జి జి.రాజేశ్వరి, ఫోక్సో స్పెషల్ కోర్టు జడ్జి ఎస్. ఉమా సునంద ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఏ.పీ.పీ కోనే సీతారామారావు, ప్రభుత్వ న్యాయవాది బి.జె. రెడ్డి ఇతర న్యాయవాదులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.