మేడే పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దాం

Поділитися
Вставка
  • Опубліковано 1 тра 2024
  • కార్మిక వర్గాన్ని మతపరంగా విభజించే బిజెపి ప్రభుత్వ విద్వేష విధానాల్ని ఓడించండి
    మేడే పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దాం
    చికాగో అమరులకు జోహార్లు అర్పిద్దాం
    కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, స్కీం వర్కర్లను, ఉద్యోగులను, కార్మికులను రెగ్యులర్ చేయాలని పోరాడుదాం
    నాలుగు లేబర్ కోట్ల రద్దు కోసం పోరాడుదాం
    మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్ట్ ఎజెండాను, నిర్బంధాన్ని వ్యతిరేకిద్దాం
    138వ మేడే సందర్భంగా ఐఎఫ్టియు నాయకుల పిలుపు
    రాజమహేంద్రవరం: అమెరికాలో చికాగో పట్టణంలో 1886లో లక్షలాదిమంది కార్మికులు తమపై సాగుతున్న శ్రమ దోపిడీకి, వేతన దోపిడీకి వ్యతిరేకంగా 8 గంటల పని దినం కోసం, తమ హక్కుల కోసం సౌకర్యాల కోసం మే ఒకటవ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు వీరోచితంగా పోరాడారు. లక్షలాదిమంది కార్మికులపై పోలీసులు, ప్రభుత్వం పెట్టుబడిదారులు కాల్పులకు తెగబడ్డారు. కార్మికుల రక్తం ఏరులై పారింది. ఆ పోరాట ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్నారు. అనేక చట్టాలను, హక్కులను, సౌకర్యాలను సాధించుకున్నారు.
    మేడే పోరాట స్ఫూర్తితో, అమరవీరులకు నివాళులర్పించి, కార్మిక వర్గం దేశవ్యాప్తంగా జండాలు ఎగరవేసి మేడే పోరాట దీక్ష దినాన్ని జరుపుకుంటున్నారు.
    రాజమహేంద్రవరం ఐ ఎఫ్ టి యు అనుబంద కార్మిక సంఘాలు రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ అధ్యక్షుడు ఎన్ రాజేష్ మే డే జెండాను ఎగరవేశారు. ఐఎఫ్టియు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఏ వి రమణ మేడే విశిష్టతను తెలియజేశారు ఐదు బల్ల మార్కెట్ వద్ద. ఐ ఎఫ్ టి యు నగర కమిటీ ఆధ్వర్యంలో ఐ ఎఫ్ టి యు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఏ.వి. రమణ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఏవి రమణ, వాసంశెట్టి భద్రం, కే రాంబాబు, ఆర్ దుర్గారావు మాట్లాడారు.
    . . కార్పెంటర్స్ ఆసోసియేషన్ జెండాను ఆ యూనియన్ అధ్యక్షులు కే రాంబాబు ఆవిష్కరించారు ఆర్ దుర్గారావు,
    వి భద్రం మాట్లాడారు. ఆర్యపురం హెచ్.పీ గ్యాస్ కంపెనీ వద్ద తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మీ శివకుమార్ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఏవి రమణ, ఉపాధ్యక్షుడు కోరాడ అప్పారావు,, డి శ్రీనివాసరావు మాట్లాడారు రాజమండ్రి అమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆడతి లో యూనియన్ కార్యదర్శి పెట్ట నరసింహారావు జెండాను ఆవిష్కరించారు. ఐ ఎఫ్ టి యు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ, జిల్లా నాయకుడు నందమూరి దుర్గారావు, తాతారావు మాట్లాడారు ఐ ఎఫ్ టి యు బొమ్మూరు కార్యాలయంలో ఐ ఎఫ్ టి యు జెండాను ఐఎఫ్టి నాయకులు వాసంశెట్టి భద్రం ఆవిష్కరించారు మేడే మృత వీరులకు నివాళులర్పించారు ఏవి రమణ, వాసంశెట్టి సతీష్, కే వెంకటలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సభలలో నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలను అమలు చేస్తుందని కార్మిక వర్గాన్ని మతపరంగా విభజించి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తుంది , ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని, కార్మిక హక్కులను, సౌకర్యాలను కాలరాస్తుందని తీవ్రంగా విమర్శించారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, ఈ కోడ్లు అమలులోకి వస్తే కార్మికులు కట్టు బానిసలుగా మారతారని విమర్శించారు. లేబర్ కోడ్ ల రద్దు కోసం, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్ల ఉద్యోగుల కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలని పిలుపునిచ్చారు. వంద రాజుగా కార్మికులు ఉత్తేజంగా పాల్గొన్నారు

КОМЕНТАРІ •