డీజీపీ జితేందర్ మహబూబ్ నగర్ లో పోలీసు సమీక్ష | Prime9 Mahbubnagar

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజాసేవల పరంగా పోలీసుల విధులు మరింత మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించామని డీజీపీ Dr. జితేందర్ IPS అన్నారు.మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మహబూబ్ నగర్ మరియు నారాయణపేట జిల్లాలా సమీక్షా సమావేశం నిర్వహించారు.ముందుగా డీజీపీ గారు మహబూబ్ నగర్ పోలీసు ప్రధాన కార్యాలయం నందు కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం చేశారు.ఈ కంట్రోల్ రూమ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిందని,ఇది జిల్లాలో నేరాల పర్యవేక్షణ, అత్యవసర సమయాల్లో వేగవంతమైన స్పందనకు ఉపయోగపడుతుందని అన్నారు.అనంతరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశం నిర్వహించారు.జిల్లాలలో ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలు, పోలీసు బలగాల ప్రదర్శించిన ప్రతిభలను ప్రస్తావించారు.ముఖ్యమైన కేసుల వివరాలు, వాటి పురోగతి,నేరాల నివారణకు చేపట్టిన చర్యలు.
    శాంతి భద్రతల పరిరక్షణలో ఎదురవుతున్న సవాళ్లు.
    ప్రజలతో పోలీసుల సంబంధాల మెరుగుదల,ప్రతి అధికారి నుండి స్థానిక స్థాయి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారాలకు మార్గదర్శకాలు అందించారు.
    ఈ సంద్భంగా డీజీపీ గారు మాట్లాడుతూ...
    ప్రజలతో నేరుగా సంబంధాలను మెరుగుపరచడం.
    నేరాల పరిశోధనను సత్వరంగా పూర్తి చేయడం.
    ఆధునిక టెక్నాలజీ వినియోగంతో సేవలను వేగవంతం చేయడం.పోలీస్ శాఖను మరింత పారదర్శకంగా మార్చడం.ఆయన పోలీసు అధికారులకు ప్రోత్సాహం అందిస్తూ, కఠిన పరిస్థితుల్లోనూ పట్టుదలగా పని చేయాలని సూచించారు.
    | Subscribe |
    | Prime9 Mahbubnagar |

КОМЕНТАРІ •