కోరుట్ల పట్టణం మరియు తెలంగాణా వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెచ్చిన హైడ్రా చట్టం అమలు చేయాలి

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సి ప్రభాకర్ గ్రంథాలయంలో ప్రజా సంఘాలు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ మరియు కోరుట్ల డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు చెన్న విశ్వనాథం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద్భంగా డాక్టర్ పేట భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా (హైదారాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) చట్టం ఒక హైదరాబాదులోనే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరియు కోరుట్లలో కూడా అమలు పరచాలని కోరారు. పట్టణంలోని తాళ్ళ చెరువు, మద్దెలచెరువు, ఎఫ్టిఎల్ భూములు, కంచెరకుంట, పితిరికుంట, కుమ్మరి కుంట, లస్మాగౌడ్ కుంట, వాగు పరివాహక ప్రాంతం బపార్ జోన్, రోడ్లు, చెరువుల కాల్వలు, దేవాలయ భూములు కబ్జాదారుల కబంధ హస్తల్లో ఆక్రమ నిర్మాణాలు జరుగుతున్నయని ఆరోపించారు. పకృతి అందించిన చెరువులను, కుంటలను, ప్రభుత్వ భూములను కాపాడి రేపటి తరానికి అందించాలి అన్నారు. కొందరు పేరుకు పెద్దమనుషుల్లా వ్యవహరిస్తూ ప్రభుత్వ భూములను కబ్జాలు చేయడం సరికాదని ఇకనైనా స్వచ్చందగా ప్రభుత్వ భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి అందించాలని కబ్జాదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కోరుట్ల డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు చెన్న విశ్వనాథం, గంగపుత్ర సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఇట్యాల రాజేందర్, కార్మిక నేత సుతారి రాములు, కవి రాస భూమయ్య, జేఏసీ, అంబేద్కర్ సంఘాల నాయకులు శనిగారపు రాజేష్, జాగర్ల రాజయ్య, ఎస్ రాజయ్య, బింగి లక్ష్మీ కాంతం, అందె వంశీ, సామల్ల రాజేశం, ఎనుగందుల రాజనర్సయ్య, మరిపెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

КОМЕНТАРІ •