Honey Vlogs Dasari
Honey Vlogs Dasari
  • 66
  • 108 849
Yanam Beach View | Andhra Goa Yanam | Godavari
Yanam beach view/Andhra mini Goa Yanam/Godavari #trending #viralvideo #video #statue
యానాం, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని ఒక భాగం.[4] ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా హద్దుగా 30 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ నివసించే 32,000 జనాభాలో, చాలామంది తెలుగు మాట్లాడతారు. 1954 లో ఫ్రాన్స్ నుండి భారతదేశానికి ఇవ్వబడినా ఫ్రెంచి యానామ్ గా గుర్తింపు ఉంది. దీనికి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఫ్రెంచి, తెలుగు సంస్కృతుల మేళవింపు యానాంలో కనిపిస్తుంది. ఫ్రెంచి పరిపాలనలో, యానాం ప్రజల పండగ రోజులలో జనవరి మాసంలో మంగళవారం జరిగే సంతలో దిగుమతి అయిన విదేశీ సరకు కొనటానికి తెలుగు వారు యానాం వెళ్లేవారు. ఇంతకు ముందు కళ్యాణపురం అనేవారు. ఎందుకంటే బ్రిటీషు వారు 1929 లో శారదా చట్టం ద్వారా బాల్యవివాహాలు నిషేధించిన తర్వాత, ఇక్కడ ఆ పెళ్ళిల్లు జరిగేవి.1995-2005 అభివృద్ధి నివేదికల ప్రకారం, పాండిచ్చేరిలో ఉత్తమ నియోజకవర్గంగా గుర్తించబడింది. కొత్త పథకాలకు ప్రయోగాత్మక కేంద్రంగా వుండేది.
వేంకటేశ్వర స్వామి దేవాలయం
మార్చు
వైష్ణవాలయం వీధి (ర్యూ విషెను) లో ప్రసిద్ధి చెందిన అలివేలు మంగా సహిత వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడి ప్రజలు చైడికుడి వెంకన్న, మీసాల వెంకన్న అని పిలుస్తారు. ఈ దేవాలయంలో ఉన్న వేంకటేశ్వర స్వామి విగ్రహం ముఖం మీద మీసాలు ఉన్నాయి. అందువలన ఇక్కడ వేంకటేశ్వర స్వామిని మీసాల వెంకన్న అని పిలుస్తారు. ఈ గుడిని 15 వ శతాబ్దంలో రాజమహేంద్రవరంని రాజధానిగా చేసుకొని పరిపాలించిన తూర్పు చాళుక్యులరాజులు సమయంలో కట్టించారు. ఈ దేవాలయం భారత దేశానికి స్వాతంత్ర్యం రావడానికి మునుపు బాల్యవివాహాలు నిషేధించడానికి పూర్వం, బాల్యవివాహాలకు వేదికగా ఉండేది. బ్రిటిషు వారి పరిపాలనలో రాజా రామ్మోహన రాయ్ వంటి సంఘసంస్కర్తల వలన శారదా చట్టం అమలులోకి వచ్చాక బాల్య వివాహాలు నిషేధించబడ్డాయి.
యానాం ఫ్రెంచ్ వారి పరిపాలన జరుపుతున్న సమయంలో ఈ దేవాలయం బాల్య వివాహాలకు ఎంత ప్రసిద్ధి చెందినదంటే ఇరుగుపొరుగు రాష్ట్రాల వారు ఇక్కడికి వచ్చి బాల్యవివాహాలు జరిపించుకొనేవారు. ఇక్కడికి మద్రాసు రాష్ట్రం, హైదరాబాదు నుండి వచ్చి బాల్యవివాహాలు జరిపించుకొనేవారు. వందలకొద్ది వివాహాలు జరగడం వల్ల ఈ ఊరిని కళ్యాణపురం అని పిలిచేవారు.
మస్జిద్, యానాం
మసీదు
మార్చు
1848 సంవత్సరంలో ఈ మసీదు (మస్జిద్) నిర్మాణానికి ఫ్రెంచ్ ప్రభుత్వం స్థలాన్ని విరాళంగా ఇచ్చింది. అప్పుడు చిన్న మసీదుగా నిర్మితమైనది. తరువాతి కాలంలో 1956 సంవత్సరంలో మసీదుకి పునరుద్ధరణ పనులు జరిగాయి. 1978 సంవత్సరంలో మసీదుని పూర్తిగా ధ్వంసం చేసి తిరిగి నిర్మించారు. 1999-2000 సంవత్సరానికి ఈ మసీదు చాలా ఉన్నత మసీదుగా తీర్చిదిద్దారు. ఒకే సమయంలో 200 మంది భక్తులు ఈ మసీదులో ప్రార్థన జరుపుకొనే అవకాశం ఉంది. రంజాన్, బక్రీద్ వంటి ముస్లిం పండుగలు చాలా జరుపబడతాయి. తల్లరేవు, కొలంక, శుంకరపాలెం నుండి కూడా భక్తులు వచ్చి ప్రార్థన జరుపుకొంటారు.
కాథలిక్ చర్చి
మార్చు
యానాం చర్చి
ఈ ఫ్రెంచి కతోలిక చర్చి ఫ్రెంచి పరిపాలనను గుర్తు చేస్తూ గుర్తింపుగా ఉంటుంది. దీనిని సెయింట్ ఆన్స్ కాథలిక్ చర్చి అని పిలుస్తారు. ఈ చర్చి ఐరోపా ఖండపు నిర్మాణశైలిలో నిర్మితమైనది. ఈ చర్చి నిర్మాణానికి కావలసిన సరంజామ, లోపలి సామాన్లు, అలంకరణ వస్తువులు ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకొనబడినవి. 1846 సంవత్సరంలో ఫ్రెంచి మతసంస్థల ద్వారా ఈ చర్చి నిర్మాణం జరిగింది. ఈ చర్చికి నిర్మాణం రాయి పాద్రే మిచెల్ లెక్‌నెమ్ ద్వారా వెయ్యబడింది, ఆయన 1930 సంవత్సరం ఏప్రియల్ 30 వ తేదిన చర్చి నిర్మాణం పూర్తి కాకుండానే మరణించాడు. 1846 సంవత్సరానికి చర్చి నిర్మాణం పూర్తి అయ్యింది. ఈ చర్చి ఆకర్షణ ఏమి అనగా ఈ చర్చికి దగ్గరలో మరో చిన్న కొండపై గుడి ఉన్నది, దీనిని కూడా ఫ్రెంచి పరిపాలకులు నిర్మించారు.
ఈ కొండ పై నున్న గుడి ప్రక్కన మరో కొండ పై చర్చిని ఆంగ్లేయ ఇంజినీర్లు నిర్మించారు. 1943 సంవత్సరంలో విలియమ్ అగస్టస్ అనే ఓడ తుఫాను వల్ల ఒక ఇసుక ద్వీపంలోకి చిక్కుకొని పోయింది. ఎంత ప్రయత్నం జరిపిన వెయ్యి టన్నులు ఉన్న ఈ ఓడని ఒడ్డుకి చేర్చలేక పోయారు. ఈ ఓడ అదే ప్రదేశంలో ఒక సంవత్సరం పాటు ఉంది. అప్పుడు అమెరికా నుండి ఇక్కడకి ఎంపికైన స్వైనీ అనే ఇంజనీరు మేరీమాతని ప్రార్థించాడు. ఆమె అనుగ్రహంతో ఆ ఓడ ఒడ్డుకి చేర్చబడింది కావున మేరిమాత గుర్తింపుగా ఈ చర్చిని కొండ మీద కట్టించారు. ఈ చరిత్ర అంతా కొండ మీద ఉన్న చర్చి గోడల మీద వ్రాయబడి ఉంది.
యానాం బీచ్
Переглядів: 36

Відео

Mahakaleswar Temple || రాజమహేంద్రవరం లో ఉజ్జయిని తరహ మహాకాళేశ్వర ఆలయం || భస్మాభిషేకం
Переглядів 1204 місяці тому
Mahakaleswar Temple || రాజమహేంద్రవరం లో ఉజ్జయిని తరహ మహాకాళేశ్వర ఆలయం #mahakaleshwar #ujjain #rajamahendravaram #godavari #shiva temple #devotional
Suryalanka Beach Bapatla ⛱️|| Haritha Resorts🏡||Resorts Prices#beachvlog#teluguvlogs
Переглядів 3,2 тис.5 місяців тому
Suryalanka Beach || Bapatla Beach ⛱️||Haritha Resorts🏡 #suryalankabeach #beach #resorts #chirala#haritha resorts#beachvibes #suryalanka #viral #tourism
గోవిందరాజ స్వామి ఆలయ చరిత్ర🙏🙏 || Govindaraja Swamy Temple in Tirupati || Dasavataram movie statue
Переглядів 9485 місяців тому
గోవిందరాజ స్వామి ఆలయ చరిత్ర || Govindaraja Swamy Temple in Tirupati || Dasavataram movie statue గోవిందరాజ స్వామి ఆలయం, తిరుపతి పట్టణంలో ఉన్న ఒక ఆలయం. ఇది తిరుపతి రైల్వే స్టేషను సమీపంలో ఉన్న కోనేటి గట్టున ఉంది. ఇక్కడ కొలువైన దేవుడు గోవిందరాజ స్వామి. ఈయన్ని శ్రీవేంకటేశ్వరునికి అన్న అని అంటారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసు...
Padmavati Ammavari Temple Tirupathi || Alivelu Mangapuram||Tiruchanuru||Tirupathi
Переглядів 906 місяців тому
#Tiruchanuru#padmavathi Ammavaru#lakshmi Padmavathi devi#alivelumangapuram #mangapuram#trendingvideo #youtube #devotional #tirupati #tirumala #padmavathi Ammavari temple అలమేలు మంగ లేదా పద్మావతి, కలియుగంలో వేంకటేశ్వరుని దేవేరిగా శ్రీమహాలక్ష్మి స్వరూపం. తిరుపతి సమీపంలోని తిరుచానూరు లేదా "ఆలమేలు మంగాపురం"లోని అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధమైనది. వెంకటేశ్వర మహాత్మ్యం కథ (తిరుమల క్షేత్రం స్థలపురాణం) ప్రక...
తిరుమల శ్రీవారి దర్శనం || Tirumala places to visit ||Full details of tirumala tirupathi
Переглядів 1,5 тис.7 місяців тому
తిరుమల శ్రీవారి దర్శనం || Tirumala places to visit ||Full details of tirumala tirupathi
అలిపిరి మెట్ల నుంచి తిరుమల నడక మార్గం 2024 || Alipiri Metlu to Tirumala Footpath
Переглядів 33 тис.8 місяців тому
అలిపిరి మెట్ల నుంచి తిరుమల నడక మార్గం 2024 || Alipiri Metlu to Tirumala Footpath
చిన్నగంజాం జాతర || Mahashivratri 🙏 || Chinnaganjam Tirunallu
Переглядів 1678 місяців тому
చిన్నగంజాం జాతర || Mahashivratri 🙏 || Chinnaganjam Tirunallu
Craft Bazaar in Kakinada || ఇంట్లో కావాల్సిన అన్నీ వస్తువులు తక్కువ ధరలకే దొరుకుతాయి
Переглядів 1118 місяців тому
Craft Bazaar in Kakinada || ఇంట్లో కావాల్సిన అన్నీ వస్తువులు తక్కువ ధరలకే దొరుకుతాయి
స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ || Crispy Chicken Pakoda || Home made easy and tasty chicken pakodi
Переглядів 758 місяців тому
స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ || Crispy Chicken Pakoda || Home made easy and tasty chicken pakodi
Kakinada Beach|Beach Park in Kakinada🏝️|Glass Bridge|
Переглядів 3909 місяців тому
Kakinada Beach|Beach Park in Kakinada🏝️|Glass Bridge|
బిర్యానీ 🍲|| Plain Biryani ||Biryani recipe in Telugu ||Home made Biryani
Переглядів 829 місяців тому
బిర్యానీ 🍲|| Plain Biryani ||Biryani recipe in Telugu ||Home made Biryani
ద్రాక్షారామం | Draksharamam Temple | Pancharamam and Shakti Peetham | Kakinada|East Godavari
Переглядів 21 тис.9 місяців тому
ద్రాక్షారామం | Draksharamam Temple | Pancharamam and Shakti Peetham | Kakinada|East Godavari
Coringa Wildlife Sanctuary🕊️🦜🐟||Mangrove Forest🌴||కోరంగి అభయారణ్యం ||Kakinada
Переглядів 4,3 тис.10 місяців тому
Coringa Wildlife Sanctuary🕊️🦜🐟||Mangrove Forest🌴||కోరంగి అభయారణ్యం ||Kakinada
Flowers with tissue paper 🌼||Paper Craft using Flowers||Step by step process in an easy way
Переглядів 6110 місяців тому
Flowers with tissue paper 🌼||Paper Craft using Flowers||Step by step process in an easy way
ఉల్లి కాడలు -కోడిగుడ్డు -రొయ్యల కూర||Ulli kadalu Egg Royyalu curry||Tasty and Easy recipe in Telugu
Переглядів 54910 місяців тому
ఉల్లి కాడలు -కోడిగుడ్డు -రొయ్యల కూర||Ulli kadalu Egg Royyalu curry||Tasty and Easy recipe in Telugu
మైసూర్ బోండా/బజ్జీ ||Mysore Bonda Recipe in Telugu || Tasty and Easy recipe ||Honey vlogs dasari
Переглядів 32210 місяців тому
మైసూర్ బోండా/బజ్జీ ||Mysore Bonda Recipe in Telugu || Tasty and Easy recipe ||Honey vlogs dasari
Dharapalli Waterfalls || ధారపల్లి జలపాతం || Annavaram|| Kakinada ||Waterfalls||East Godavari
Переглядів 72410 місяців тому
Dharapalli Waterfalls || ధారపల్లి జలపాతం || Annavaram|| Kakinada ||Waterfalls||East Godavari
కట్ట చేపల ఇగురు🐟 || Katta Chepala Eguru || Fish Curry ||Telugu Recipe in Telugu
Переглядів 64610 місяців тому
కట్ట చేపల ఇగురు🐟 || Katta Chepala Eguru || Fish Curry ||Telugu Recipe in Telugu
Chirala to Kakinada Train Journey || నా ప్రయాణం అనుభవాలు ||Risky journey || Honey vlogs dasari
Переглядів 28911 місяців тому
Chirala to Kakinada Train Journey || నా ప్రయాణం అనుభవాలు ||Risky journey || Honey vlogs dasari
History of Motupalli (మోటుపల్లి చరిత్ర) ||kakatiya vaibhavam ||Rani Rudramadevi||honey vlogs dasari
Переглядів 28811 місяців тому
History of Motupalli (మోటుపల్లి చరిత్ర) ||kakatiya vaibhavam ||Rani Rudramadevi||honey vlogs dasari
Ramapuram Beach || Sea Breeze Resorts || Chirala Beach Resorts || Best Beach in Andhra Pradesh
Переглядів 8 тис.11 місяців тому
Ramapuram Beach || Sea Breeze Resorts || Chirala Beach Resorts || Best Beach in Andhra Pradesh
బాలామృతం బిస్కెట్లు || balamrutham recepis in telugu || Biscuits
Переглядів 6911 місяців тому
బాలామృతం బిస్కెట్లు || balamrutham recepis in telugu || Biscuits
Kotappakonda Temple || Sri Trikoteswara Swamy Temple
Переглядів 35911 місяців тому
Kotappakonda Temple || Sri Trikoteswara Swamy Temple
జున్ను తయారీ విధానం😋 || JUNNU Recipe in Telugu 😋
Переглядів 39011 місяців тому
జున్ను తయారీ విధానం😋 || JUNNU Recipe in Telugu 😋

КОМЕНТАРІ